కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- July 23, 2026
కువైట్ సిటీ: కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఈ మేరకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 23, నుంచి భారతీయుల కోసం పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్, అట్టెస్టేషన్ సేవలు DU Digital Global నిర్వహించే మూడు కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల (ICACs) ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
కొత్తగా ప్రారంభమైన కేంద్రాల చిరునామాలు:
* కువైట్ సిటీ ICAC: అల్ జవహారా టవర్, 1వ అంతస్తు, కిబ్లా, బ్లాక్ 11, ప్లాట్ 11, సలేం అల్ ముబారక్ స్ట్రీట్.
* ఫహాహీల్ ICAC: సమా మాల్, 3వ అంతస్తు, యూనిట్ 55, ప్లాట్ నం. 21, ఫహాహీల్.
* దజీజ్ ICAC: వాహా మాల్, గ్రౌండ్ ఫ్లోర్, యూనిట్లు 37, 38, అల్ దజీజ్.
ఈ మూడు కేంద్రాలు ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పనిచేస్తాయి.
దరఖాస్తుదారులు నేరుగా కేంద్రాలను సందర్శించి (Walk-in) సేవలు పొందవచ్చు లేదా ఆన్‌లైన్‌లో ముందస్తుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకునే సమయంలో అవసరమైన సేవా విభాగాన్ని (Service Category) జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
భారత ప్రభుత్వం నిర్ణయించిన పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవల ఫీజులకు అదనంగా, ప్రతి దరఖాస్తుకు DU Digital Global 6 కువైటీ దినార్ (KD 6) సేవా రుసుము వసూలు చేస్తుంది. ఇందులో దరఖాస్తు ఫారం నింపడం, ఫోటోగ్రఫీ, డాక్యుమెంట్ టైపింగ్, దేశీయ కొరియర్ సేవలు, ప్రింట్లు, ఫోటోకాపీలు వంటి అనుబంధ సేవలు కూడా ఉంటాయి. వివిధ సేవలకు సంబంధించిన ప్రభుత్వ ఫీజులు, సేవా రుసుముల పూర్తి వివరాలను కూడా భారత రాయబార కార్యాలయం విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- BRICS సమ్మిట్..నేటి షెడ్యూల్ ఇదే
- తెలంగాణ అసెంబ్లీ సెషన్: ప్రజా విశ్వాసం బిల్లు-2026 ఆమోదం
- తమిళ సినీ అభిమానులకు సర్ప్రైజ్.. సిల్వర్‌స్టోన్‌లో విజయ్, అజిత్ కుమార్ కలయిక
- SIIMA 2026 తెలుగు,కన్నడ విజేతలు వీరే..
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!







