సినిమా రివ్యూ:‘చెన్నై లవ్ స్టోరీ’
- July 24, 2026
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన చిత్రమే ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకడు సాయి రాజేష్ కథను రవి నంబూరి తెరకెక్కించారు. ఈ సినిమాని సాయి రాజేష్, ఎస్.కె.యన్‌తో కలిసి నిర్మించారు. ప్రమోషన్లు చాలా బాగా చేశారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రావడం మరో హైప్. ఇన్ని హైపుల మధ్య రిలీజైన ఈ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
హీరోయిన్ యాంగిల్ నుంచే ఈ సినిమా కథ మొదలవుతుంది. నివి (శ్రీ గౌరీ ప్రియ) లవ్ ఫెయిల్యూర్ కావడంతో లేడీ దేవదాసులా మందుకు బానిసైపోతుంది. ఆమెని ఆ సిట్యువేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు చెన్నై తీసుకెళ్తారు ఆమె స్నేహితులు. అక్కడ కూడా నివిలో ఏమాత్రం మార్పు రాదు. అలాంటి టైమ్‌లోనే నివి వున్న ఇంట్లోకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఎంటర్ అవుతాడు. మొదట్లో స్టీవెన్ అంటే నచ్చని నివి, మెల్ల మెల్లగా అతని మాటలు, చేష్టలకు ఇంప్రెస్ అవుతుంది. క్రమంగా స్టీవెన్‌తో లవ్‌లో పడుతుంది. ఎవ్వరూ లేని అనాధ అయిన స్టీవెన్ కూడా తొలి చూపులోనే నివిని ఇష్టపడతాడు. తానే తన ప్రపంచం అనుకుంటాడు. డైరెక్టర్ కావాలని చెన్నై వచ్చిన స్టీవెన్, ప్రొఫిషనల్‌గా తన కల నెరవేర్చుకున్నాడా.? ఎవ్వరూ లేని తనకు, తాను దేవతలా ఆరాధిస్తున్న నివి దక్కిందా.? నివితో బ్రేకప్ చేసుకున్న అజయ్ (త్రిగుణ్) మళ్లీ తన జీవితంలోకి ఎందుకొచ్చాడు.? ఆ తర్వాత స్టీవెన్, నివిల రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులొచ్చాయ్.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ‘చెన్నై లవ్ స్టోరీ’ తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఎప్పటిలాగే చాలా తేలికగా నటించేశాడు. తనదైన ఈజ్‌తో స్టీవెన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాకి మెయిన్ అస్సెట్ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ. సాయి రాజేష్ తన కథల్లో హీరోయిన్లకు ముఖ్యంగా బలమైన పాత్రలను రాస్తుంటాడు. అలాగే, ఈ సినిమాలోనూ హీరోయిన్ పాత్ర చాలా బలమైనది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా హీరోయిన్ని లేడీ దేవదాసులా చూపించేశాడు. ఆ పాత్రలో గౌరీ ప్రియ చాలా బాగా నటించి మెప్పించింది. తొలి ప్రేమ ఫెయిలవడంతో హార్ట్ బ్రేకప్ అయ్యి, జీవితం అస్తవ్యస్తం చేసుకున్న యువతిలా.. మళ్లీ తిరిగి మలి ప్రేమలో మాధుర్యాన్ని తెలుసుకుని మార్పు తెచ్చుకునే యువతిలా రెండు వేరియేషన్స్‌లో చాలా బాగా నటించి మెప్పించింది. అచ్చమైన తెలుగమ్మాయి కావడంతో అందంతో పాటూ, హావభావాలు, కూడా చక్కగా పలికించింది. నూటికి నూరు మార్కులేయించుకుంది ఈ క్యారెక్టర్లో గౌరీ ప్రియ. మిగిలిన పాత్రధారులు సిరి హనుమంతు, కార్తీక్ నేని, పూజ, నవీన్ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
తొలి సినిమా కావడంతో డైరెక్టర్ రవి నంబూరి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడని చూస్తున్నంతసేపూ అనిపిస్తుంది. అయితే, అక్కడక్కడా కొంత తడబాట్లున్నప్పటికీ చివరికొచ్చేసరికి ప్రేక్షకులు కన్విన్స్ అయిపోతారు. ఫస్టాఫ్ అంతా బ్రేకప్ పర్ఫామెన్స్, ఆమెని లవ్‌లో పడేయడానికి హీరో చేసే చిలిపి చేష్టలు అలా అలా నడిచిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే సెంటిమెంట్ సీన్ భావోద్వేగానికి గురి చేసి, సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేస్తుంది. ఎలా హ్యాండిల్ చేస్తాడా.? సెకండాఫ్‌లో డైరెక్టర్ ఈ సినిమాని అనిపించేంతలా వుంటుంది. సెకండాఫ్‌లో కొన్ని రొటీన్ సన్నివేశాలు ఊహలకు తగ్గట్లే వస్తాయి. కానీ, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ పీక్స్‌కి వెళుతుంది. తొలి సారి ప్రేమించిన అబ్బాయ్ తిరిగొచ్చిన సన్నివేశాలు ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాకి కథ, కథనం ఓ ఎత్తైతే, మణిశర్మ అందించిన మ్యూజిక్ మరో హీరో అని చెప్పాలి. పాటలు వినసొంపుగా ఇవ్వడంతో పాటూ, బీజీఎమ్ అదరగొట్టేశాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. ఎడిటింగ్, మాటలు బాగున్నాయ్. నిర్మాణ విలువలు చాలా చక్కగా కుదిరాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ సూపర్బ్.
ప్లస్ పాయింట్స్:
కిరణ్ అబ్బవరం మరియు శ్రీ గౌరీ ప్రియ పర్ఫామెన్స్, ఇంటర్వెల్ బ్లాక్, పతాక సన్నివేశాలు మొదలైనవి.
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో అక్కడక్కడా రొటీన్‌గా అనిపించిన సన్నివేశాలు..
చివరిగా:
‘చెన్నై లవ్ స్టోరీ’ హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ.. అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ.!
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







