దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- July 24, 2026
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) ప్రయాణికుల కోసం మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌కు చేరుకునే ముందే తాము స్మార్ట్ గేట్స్ వినియోగానికి అర్హులా కాదా అనే విషయాన్ని క్షణాల్లో తెలుసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) సంయుక్తంగా అభివృద్ధి చేసిన "స్మార్ట్ గేట్స్ ప్రీ-ఎలిజిబిలిటీ వెరిఫికేషన్" సేవ ద్వారా ప్రయాణికులు తమ అర్హతను వెంటనే నిర్ధారించుకోవచ్చు.
ఈ సేవను Pocket Flights ప్లాట్‌ఫారమ్ ద్వారా లేదా విమానాశ్రయ టెర్మినల్స్, బోర్డింగ్ గేట్ల వద్ద ఏర్పాటు చేసిన QR కోడ్లను స్కాన్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు.
ఈ కొత్త సేవతో ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్‌కు చేరుకున్న తర్వాత ఏర్పడే అనిశ్చితి తగ్గడంతో పాటు, ప్రయాణికులు విమానాశ్రయంలో మరింత వేగంగా, సులభంగా తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలు కలుగుతుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది.
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు మరింత వేగవంతమైన, అంతరాయంలేని సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







