'పళ్ళబురుసు' నుంచి కొత్త సోకు సాంగ్ రిలీజ్

- July 24, 2026 , by Maagulf
\'పళ్ళబురుసు\' నుంచి కొత్త సోకు సాంగ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు' ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట 'కొత్త సోకు' లిరికల్ వీడియోను విడుదల చేశారు. పల్లె వాతావరణం, జానపద సంగీతం, పండుగ సందడిని ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ పాట సినిమా ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.

కథానాయకుడి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిన 'కొత్త సోకు' పాట సరదా సాహిత్యం, ఆకట్టుకునే బీట్‌తో అలరించింది "అంగి జూడే... ఆతడి పొంగు జూడే... దోతి రంగు జూడే..." అనే క్యాచీ హుక్ లైన్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, పళ్ళబురుసు ప్రపంచానికి ఓ అందమైన పరిచయాన్ని ఇస్తోంది.

సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటకు పవన్ సీహెచ్ మ్యూజిక్ అందించగా, వాగ్దేవి తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు మరింత ఊపు తీసుకొచ్చారు. కథానాయకుడి చలాకీతనాన్ని, పల్లె పండుగల సందడిని, జానపద మాధుర్యాన్ని ఈ పాట చక్కగా చూపించింది.

ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న 'పళ్ళబురుసు' చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, పల్లె జీవన శైలిని ప్రతిబింబించే పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్నాయి. ఎపిక్ స్టూడియోస్  ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణానీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ, విష్ణు కోరియోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్

'కొత్త సోకు' లిరికల్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 'పళ్ళబురుసు' చిత్రం ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com