అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక

- July 24, 2026 , by Maagulf
అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక

టెహ్రాన్: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్ దళాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తన దాడులను మరింత ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒక కీలక ప్రకటన చేస్తూ, గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా సైనిక బేస్‌లకు కనీసం 500 మీటర్ల పరిధిలో సామాన్య ప్రజలెవరూ ఉండవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పుడైనా ఏక్షణంలోనైనా వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాకుండా, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బలగాల కదలికలు మరియు ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని అందించాలని కూడా స్థానిక ప్రజలకు ఐఆర్‌జీసీ పిలుపునిచ్చింది.

13వ రోజూ యుఎస్ వైమానిక దాడులు.. ఇరాన్‌లో భారీగా పెరిగిన మరణాలు!

మరోవైపు ఇరాన్ లక్ష్యాలపై వరుసగా 13వ రోజు కూడా తమ వైమానిక దాడులు కొనసాగాయని అమెరికా సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ తాజా అమెరికా దాడుల కారణంగా దేశంలో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రీసెంట్ ఎటాక్స్‌లో దాదాపు 55 మంది పౌరులు మరియు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 600 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఇరు పక్షాల మధ్య ఈ వరుస దాడులు, ప్రతిదాడులు పశ్చిమాసియాలో సంపూర్ణ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుండగా, మూడో ప్రపంచ యుద్ధ భయాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com