సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- July 25, 2026
రియాద్: సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18, 2026న నిర్వహించనున్న తెలుగు భాషా దినోత్సవం (TBD) వేడుకల సందర్భంగా నిర్వహించిన సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది. జూలై 23, గురువారం నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో తెలుగు సంఘానికి చెందిన అనేక జట్లు ఉత్సాహంగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటాయి.
టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్లు క్రమశిక్షణ, జట్టు సమన్వయం, క్రీడా స్ఫూర్తితో పోటీపడి ప్రేక్షకులను అలరించాయి. నిర్ణయించిన మ్యాచ్‌లన్నీ విజయవంతంగా పూర్తికావడంతో ఈ క్రీడా వేడుక పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయంగా నిలిచింది.
సౌదీ అరేబియాలోని తెలుగు సమాజం కోసం తొలిసారిగా నైట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం విశేషమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రవాసుల్లో క్రీడా స్ఫూర్తిని మరింత ప్రోత్సహించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని క్రీడా కార్యక్రమాలకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు తాగునీరు సహా అవసరమైన అన్ని సౌకర్యాలను సాటా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన అన్ని జట్లు, కెప్టెన్లు, ఆటగాళ్లు, వాలంటీర్లు, అభిమానులు, సహకారులకు సాటా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా కృషి చేసిన ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, మహమ్మద్ నూరుద్దీన్, సింగు నరేష్ కోర్ టీం సభ్యులను సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సాటా వ్యవస్థాపకులు మల్లేశన్, రియాద్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ పూర్తి మద్దతు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే కార్యక్రమానికి హాజరై ప్రోత్సాహం అందించిన వీరపల్లి యోగేష్ బాబు, అహ్మద్ షహబాజ్ (హల్చల్ కేఫ్), సురేష్, శంకర్తో పాటు సాటా కోర్ టీమ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా TASA వ్యవస్థాపకులు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి), కోర్ టీమ్ సభ్యుడు ఇబ్రహీం కార్యక్రమానికి హాజరై మద్దతు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన షిహాబ్ కొట్టుకాడ్ ఆటగాళ్లు, నిర్వాహకులను అభినందిస్తూ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక నైట్ క్రికెట్ టోర్నమెంట్ విజయాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా తెలుగు సమాజాన్ని ఐక్యం చేసే ఇలాంటి మరెన్నో విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు సాటా కట్టుబడి ఉందని సాటా రియాద్ కోర్ టీమ్ వెల్లడించింది.

తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







