ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!
- July 25, 2026
న్యూ ఢిల్లీ: నీట్ (NEET-UG 2026) పేపర్ లీకేజీ వివాదం, విద్యావ్యవస్థ సంస్కరణలపై నెలరోజులుగా సాగుతున్న పోరాటంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా అనంతరం ప్రముఖ సామాజిక వేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తొలిసారి స్పందించారు. విద్యాశాఖ మంత్రి వైదొలగడాన్ని “ప్రజాస్వామ్య సాధించిన విజయం”గా ఆయన అభివర్ణించారు. ఆస్పత్రి బెడ్‌పై నుంచి విజయాన్ని సూచిస్తూ ‘V’ సంకేతాన్ని చూపిస్తున్న ఫోటోను ఎక్స్ (X) ఖాతాలో పంచుకున్న వాంగ్‌చుక్.. “ఇది శాంతి, ఓపిక మరియు పట్టుదలకు లభించిన విజయం” అని వ్యాఖ్యానించారు.
“అకౌంటబిలిటీ నుంచి సంస్కరణల వైపు”
మంత్రి రాజీనామా అనంతరం విద్యావ్యవస్థలో మార్పులపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్య విజయం: “రోడ్ల పైనుంచి ప్రత్యక్షంగా సాధించుకున్న ప్రజాస్వామ్య విజయం ఇది. భయాన్ని వీడి దేశం నలుమూలల నుంచి నినదించిన పౌరులకు, Gen-Z యువతకు మరియు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులకు అభినందనలు” అని పేర్కొన్నారు.
తదుపరి అడుగు – సంస్కరణలు: ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి లభించాల్సిన “జవాబుదారీతనం (Accountability)” సాధించామని, ఇకపై చర్చలు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన “సంస్కరణల (Reforms)” వైపు మల్లుతాయని స్పష్టం చేశారు.
CJP తాజా వైఖరి–నెరవేరని ఇతర డిమాండ్లు
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయగానే జంతర్ మంతర్ వద్ద సీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నప్పటికీ, తమ పోరాటం పూర్తి కాలేదని స్పష్టం చేశాయి.
“కాక్రోచ్‌లతో పెట్టుకోవద్దు”: రాజీనామా వార్త తెలిసిన వెంటనే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఒక వీడియో విడుదల చేస్తూ.. “ఇది ప్రజాస్వామ్య శక్తి. ఆయన రాజీనామా చేశారు.. కాక్రోచ్‌లతో పెట్టుకోవద్దని గుర్తుంచుకోండి” అని వ్యాఖ్యానించారు.
కొత్తగా 4వ డిమాండ్ చేరిక: ప్రధాన్ రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ పూర్తయినప్పటికీ, మిగిలిన డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు:
నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం.
ఆందోళనల్లో పాల్గొన్న ఏ విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు.
విద్యార్థులపై మోపిన కేసులు ఎత్తివేయాలి.
తాజా డిమాండ్: శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేసిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) మరియు ఢిల్లీ పోలీసులు క్షమాపణలు చెప్పాలి.
తాజా వార్తలు
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ







