ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- July 25, 2026
మస్కట్: ఒమన్‌లోని ధోఫార్ ఖరీఫ్ సీజన్ సందర్భంగా పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తన భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. ధోఫార్ గవర్నరేట్‌లోని బీచ్‌లు, స్ప్రింగ్స్, ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక వాటర్ రెస్క్యూ బృందాలను మోహరించింది.
ఖరీఫ్ సీజన్‌లో భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, ప్రజల భద్రతను నిర్ధారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వాటర్ రెస్క్యూ బృందాలు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ, సందర్శకులకు భద్రతా సూచనలు అందిస్తున్నాయి. ప్రమాదం సంభవించిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని అల్ సాదా సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సెంటర్ అసిస్టెంట్ ఆఫీసర్ కెప్టెన్ ముస్లిం బిన్ మహ్మద్ అల్ అమ్రీ తెలిపారు. అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం రెస్క్యూ బృందాలను మోహరించినట్టు తెలిపారు.
రెస్క్యూ కార్యకలాపాలతో పాటు ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించడం కూడా తమ బాధ్యతల్లో భాగమేనని ఆయన పేర్కొన్నారు. బీచ్‌లు, స్ప్రింగ్స్ లను సందర్శించే వారికి జాగ్రత్తలు వివరించడం, పర్యాటక ప్రాంతాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ బృందాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఒమానీ సిబ్బంది పనిచేస్తున్నారని, ఆధునిక రెస్క్యూ పరికరాలు, ప్రత్యేక వాహనాలు, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో వీరు అన్ని రకాల నీటి సంబంధిత అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నారని కెప్టెన్ అల్ అమ్రీ వెల్లడించారు.
ఖరీఫ్ సీజన్ మొత్తం సివిల్ డిఫెన్స్ అత్యున్నత స్థాయి అప్రమత్తతతో పనిచేస్తోందని, పర్యాటకులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, రెస్క్యూ సిబ్బందికి సహకరించాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సివిల్ డిఫెన్స్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
- 6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం







