ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- July 25, 2026
కువైట్ సిటీ: కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయ గృహ కార్మికురాలు తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తూ కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం మానవతా దృక్పథంతో వేగంగా స్పందించింది.
పుదుచ్చేరికి చెందిన జయకుమారి అనే గృహ కార్మికురాలు పాస్‌పోర్టు, ఇతర ప్రయాణ పత్రాలకు సంబంధించిన సమస్యల కారణంగా భారత్‌కు తిరిగి వెళ్లలేకపోయారు. ఇదే సమయంలో ఆమె తండ్రి మరణించిన విషాద వార్త అందడంతో అత్యవసరంగా స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం, కువైట్ తమిళ్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్‌నారాయణన్, సామాజిక కార్యకర్త మతి సమన్వయంతో అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేశారు.
భారత రాయబారి పరిమితా త్రిపాఠి నేతృత్వంలోని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసరంగా అవసరమైన అధికారిక ప్రక్రియలను పూర్తి చేసి, ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసింది. దీంతో జయకుమారి సమయానికి భారత్ చేరుకుని తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం లభించింది.
ఈ సందర్భంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో వేగంగా స్పందించిన భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు. జయకుమారి కూడా ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన భారత రాయబార కార్యాలయం, కువైట్ తమిళ్ సంఘం, సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
- 6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం
- నేపాల్‌లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ముమ్మర గాలింపు
- యూఏఈ నుంచి ‘నో ఇండియా ప్రోగ్రామ్’కు ప్రియదర్శిని ఎంపిక
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కొత్త నిబంధనలు..!!
- బిగ్ టికెట్లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!
- సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్‌లైన్ మూసివేత..!!
- కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్లో కీలక చర్చలు..!!







