బీఎస్‌ఎన్‌ఎల్ వారి బంపర్ ఆఫర్
- August 14, 2016
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా తమ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి ఆదివారం ల్యాండ్‌లైన్ నుంచి దేశంలోని ఏ నెట్‌వర్క్ ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ ఫోన్‌కు అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు టెలికాంశాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ మరో ఆఫర్‌ను ప్రకటించింది. స్వాతంత్య్రదినోత్సవం(ఆగస్టు 15న) సందర్భంగా ల్యాండ్‌లైన్ నుంచి ఏ నెట్‌వర్క్ ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ ఫోన్‌కు అపరిమితంగా మాట్లాడుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రైవేటు సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే రాత్రి 9 నుంచి 7 గంటల వరకు ల్యాండ్‌లైన్ నుంచి ఏ నెట్‌వర్క్ ల్యాండ్‌లైన్ లేదా మొబైల్‌కు అపరిమితంగా మాట్లాడుకునే సౌకర్యాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







