7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- July 26, 2026
మస్కట్: ఒమన్‌లో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) తన తనిఖీలను కట్టుదిట్టం చేసింది. జూలై 25తో ముగిసిన వారంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 18 వేలకుపైగా గడువు ముగిసిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకోగా, దాదాపు 54 వేల పొగాకు ఉత్పత్తులు, నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీకెండ్ పనితీరు నివేదికను విడుదల చేసిన సీపీఏ.. వివిధ గవర్నరేట్‌లలో చేపట్టిన తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, చట్ట అమలు చర్యల వివరాలను వెల్లడించింది.
దోఫార్ ఖరీఫ్ సీజన్ సందర్భంగా వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు "యోర్ అవేర్‌నెస్.. యోర్ సేఫ్టీ" పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. పర్యాటక సీజన్‌లో వినియోగదారుల హక్కులు, సురక్షిత కొనుగోళ్లపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని పేర్కొంది.
మస్కట్, అల్ దాఖిలియాహ్ గవర్నరేట్‌లలో నిర్వహించిన తనిఖీల్లో వ్యాపార సంస్థల నుంచి 18 వేలకుపైగా గడువు ముగిసిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ అల్ షర్కియాహ్, ఉత్తర అల్ బతీనాహ్ గవర్నరేట్‌లలో దాదాపు 54 వేల పొగాకు ఉత్పత్తులు, నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను జప్తు చేసినట్లు తెలిపింది.
వీటితోపాటు తయారీ లోపాలను గుర్తించిన నేపథ్యంలో 2019–2023 మోడళ్లకు చెందిన 2,266 లెక్సస్ కార్లు, 2022–2025 మోడళ్లకు చెందిన 174 బీఎండబ్ల్యూ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సీపీఏ ప్రకటించింది. ఉత్తర అల్ బతీనాహ్‌లో వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించి OMR 4,000కుపైగా మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి అందించడంతో పాటు OMR 32,000కు పైగా విలువైన వాహనాన్ని కొత్తదానితో రీప్లేస్ చేయించినట్లు తెలిపింది.
అల్ ధాహిరాహ్, మస్కట్ ప్రాంతాల్లో వినియోగదారుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించిన పలువురు వ్యాపార సంస్థలపై కోర్టులు జరిమానాలు విధించడంతో పాటు, బాధిత వినియోగదారులకు పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు నివేదికలో పేర్కొంది. నియమిత మార్కెట్ తనిఖీలు, కఠిన చట్ట అమలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని సీపీఏ పునరుద్ఘాటించింది. అలాగే, ఎలాంటి ఉల్లంఘనలనైనా తమ అధికారిక కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







