కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- July 26, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన విద్యాశాఖ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికి శాఖ కార్యకలాపాలపై వివరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పూర్తి వినయంతో, అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. దేశ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ రాజీనామాను ఆమోదించారు. అనంతరం ప్రధాని సిఫారసు మేరకు ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో ఇప్పటికే ఆహార, ప్రజాపంపిణీ మరియు ఇతర శాఖలను నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషి.. ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఆయన తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







