మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- September 12, 2026
ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన సాగర తీర మహాగణపతి ఆలయ కమిటీ సభ్యులు
అమరావతి: మచిలీపట్నం మంగినపూడి తీరంలో నిర్వహించనున్న సాగర తీర మహాగణపతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాగర తీర మహాగణపతి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కలసి, మంగినపూడి సముద్ర తీరంలో నిర్వహించనున్న మహాగణపతి ఉత్సవాల వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా మచిలీపట్నంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు.
మంగినపూడి తీరంలో ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాధాన్యతను పెంపొందించేలా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మచిలీపట్నం సాగర తీరానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు, స్థానిక పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







