ఇరాన్‌-ఒమన్‌ చర్చల్లో పురోగతి

- July 27, 2026 , by Maagulf
ఇరాన్‌-ఒమన్‌ చర్చల్లో పురోగతి

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకల రాకపోకలను మళ్లీ ప్రారంభించేందుకు ఇరాన్, ఒమన్‌ (Iran-Oman) దేశాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలు ఫలప్రదంగా ముందుకుసాగుతున్నాయి.టెహ్రాన్ వేదికగా ఒమన్ ప్రతినిధుల బృందం, ఇరాన్ అధికారుల మధ్య రెండు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. తీరప్రాంత దేశాల సార్వభౌమాధికారానికి ఎటువంటి భంగం కలగకుండా, వాణిజ్య నౌకల ప్రయాణానికి అంతరాయం లేని భద్రత కల్పించేందుకు సాంకేతిక, రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ ధ్రువీకరించారు. ప్రస్తుతం నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినప్పటికీ, సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అమెరికా జోక్యం–తీవ్రమైన వివాదం

జూన్ నెలలో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై సేవా రుసుములు (Service Fees) విధించాలని ఇరాన్, ఒమన్ యోచించాయి. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం విచ్ఛిన్నమై, అమెరికా దాడులకు దిగింది. యూఎస్ చర్యలకు నిరసనగా హర్మూజ్‌ను మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడమే కాకుండా, తమ అనుమతి లేకుండా ఏ నౌకనూ అనుమతించబోమని హెచ్చరించింది. అమెరికా ప్రోత్సాహంతో నౌకలు ఒమన్ తీరం గుండా వెళ్లేందుకు ప్రత్నించడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఇరాన్‌పై అమెరికా దాడులు నిలిపివేయడంతో, టెహ్రాన్-మస్కట్ మధ్య మళ్లీ శాంతి చర్చలు ఊపందుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com