న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!

- July 28, 2026 , by Maagulf
న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్  ప్రారంభించిన సౌదీ అరేబియా..!!

రియాద్: ప్రభుత్వ డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, దవా మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ డిజిటల్ ‘న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ను ప్రారంభించింది. ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి షేక్ డాక్టర్ అబ్దుల్లతీఫ్ అల్ అల్‌షేఖ్ ఈ సేవను ప్రారంభించారు. ఇస్లాం మతాన్ని స్వీకరించాలనుకునే వారి దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు.

దరఖాస్తు సమర్పించడం నుంచి పరిశీలన, ఆమోదం వరకు అన్ని దశలు ఆన్‌లైన్‌లోనే పూర్తవుతాయి. దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే డిజిటల్ కార్డు తవక్కల్నా (Tawakkalna) యాప్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ సేవను సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) వ్యవస్థతో అనుసంధానం చేయడంతో, కార్డును ఎలక్ట్రానిక్‌గా సులభంగా ధ్రువీకరించవచ్చు.

అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన డేటా సేకరణ, ఖచ్చితమైన నివేదికలు, గణాంకాల తయారీ సులభమవుతుందని, భవిష్యత్ ప్రణాళికలు, నిర్ణయాల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి డిజిటల్ ‘న్యూ ముస్లిం’ కార్డుపై ప్రత్యేక QR కోడ్ ఉంటుంది. దీని ద్వారా సంబంధిత అధికారులు కార్డు ప్రామాణికతను ధృవీకరించి, అది ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా జారీ చేసినదేనని నిర్ధారించుకోవచ్చని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com