న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- July 28, 2026
రియాద్: ప్రభుత్వ డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, దవా మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వ శాఖ డిజిటల్ ‘న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ను ప్రారంభించింది. ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి షేక్ డాక్టర్ అబ్దుల్లతీఫ్ అల్ అల్షేఖ్ ఈ సేవను ప్రారంభించారు. ఇస్లాం మతాన్ని స్వీకరించాలనుకునే వారి దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు.
దరఖాస్తు సమర్పించడం నుంచి పరిశీలన, ఆమోదం వరకు అన్ని దశలు ఆన్లైన్లోనే పూర్తవుతాయి. దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే డిజిటల్ కార్డు తవక్కల్నా (Tawakkalna) యాప్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ సేవను సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) వ్యవస్థతో అనుసంధానం చేయడంతో, కార్డును ఎలక్ట్రానిక్‌గా సులభంగా ధ్రువీకరించవచ్చు.
అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన డేటా సేకరణ, ఖచ్చితమైన నివేదికలు, గణాంకాల తయారీ సులభమవుతుందని, భవిష్యత్ ప్రణాళికలు, నిర్ణయాల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి డిజిటల్ ‘న్యూ ముస్లిం’ కార్డుపై ప్రత్యేక QR కోడ్ ఉంటుంది. దీని ద్వారా సంబంధిత అధికారులు కార్డు ప్రామాణికతను ధృవీకరించి, అది ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా జారీ చేసినదేనని నిర్ధారించుకోవచ్చని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







