'అబ్దుల్ కలాం' మృతికి ప్రముఖుల సంతాపం
- July 27, 2015
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకస్మిక మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయిందన్నారు. కలాం మరణం పట్ల ప్రధాని ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భారతదేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని, ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. దేశం గర్వించదగ్గ అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్తగా, మాజీ రాష్ట్రపతిగా కలాం దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని ప్రధాని కొనియాడారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన స్వయం కృషితో ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిపోతుందన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కలాం మరణం భారత జాతికి తీరని లోటని పేర్కొన్నారు. కలాం గొప్ప మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. దేశంలో మిసైల్‌మెన్‌గా కలాం పేరుగడించారని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం మృతి దేశానికి తీరని లోటని, ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అని దేశం దార్శనికుడు, స్పూర్తిదాతను కోల్పోయిందన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ , బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తదితరులు ట్విట్టర్ వేదికగా తమ సంతాప సందేశాలను పోస్టు చేశారు. కలాం మృతి దేశానికి తీరని లోటని, దేశ ప్రజలకు కలాం ఇచ్చిన స్ఫూర్తినిచ్చారని అన్నారు. శాస్త్రవేత్తగా దేశానికి ఎన్నో సేవలందించారని కొనియాడారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







