కళ్లకింది నల్లని వలయాలకోసం చిట్కా

- July 27, 2015 , by Maagulf
కళ్లకింది నల్లని వలయాలకోసం చిట్కా

రాత్రిళ్లు కొంతమందికి పని ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల నిద్ర సరిగా పట్టదు. దాంతో కళ్ల కింద నల్లని వలయాలు ఏర్నడతాయి. వీటికి మార్కెట్లో రకరకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో అధిక పి.హెచ్‌ ఉండడం వల్ల అవి చర్మానికి కొంత హాని చేస్తాయి. అందుకే వాటికి మనం మన ఇంట్లోనే తేలిగ్గా వేసుకునే కొన్ని ప్యాక్స్‌ మీకోసం. పచ్చి పాలలో ముంచిన దూదిని కళ్ల కింద వలయాల చుట్టూ అద్దితే, ఫలితం ఉంటుంది. ఇలా ఒక పావుగంట సేపు రోజుకు రెండు సార్లు చేస్తే మంచిది. కీరదోస గుజ్జును కంటి కింద ప్యాక్‌లా వేసి ఇరవై నిముషాలు ఉంచి, చల్లని నీటితో శుభ్రం చేస్తే నల్ల వలయాలు మాయమవుతాయి. టొమాటో రసానికి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి అద్దినా ఫలితం ఉంటుంది. వట్టి తేనెలో దూది ముంచి కళ్ల కింద అద్దినా వలయాలు కొన్ని రోజులకి ఈ కంటి కింద నల్ల వలయాల సమస్య తగ్గుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com