దుబాయ్‌లో ట్రాఫిక్‌కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!

- July 28, 2026 , by Maagulf
దుబాయ్‌లో ట్రాఫిక్‌కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!

దుబాయ్: దుబాయ్ నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నాలుగు కీలక జంక్షన్లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఔద్ మెథా–అల్ అసాయెల్ స్ట్రీట్స్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త బ్రిడ్జిలను, టన్నెల్స్, అదనపు లేన్లు, సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రస్తుతం 20 నిమిషాలు పట్టే ప్రయాణ సమయం కేవలం 5 నిమిషాలకు తగ్గనుంది. జబీల్, అల్ జద్దాఫ్, ఔద్ మెథా, ఉమ్ హురైర్ ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే మూడు లేన్లతో కూడిన ఒక కొత్త బ్రిడ్జిని ప్రారంభించగా, మరో రెండు టన్నెల్స్, ఒక బ్రిడ్జి ఆగస్టు చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

1. ఔద్ మెథా వీధి మరియు షేక్ రషీద్ రోడ్

* అల్ గర్హౌద్ వంతెన, దుబాయ్-అల్ ఐన్ రోడ్ మరియు బుర్ దుబాయ్ వైపు ట్రాఫిక్ రాకపోకలను మెరుగుపరచడమే ఈ పనుల ఉద్దేశ్యం.

* అల్ గర్హౌద్ బ్రిడ్జి వైపు వెళ్లేందుకు, ఔద్ మెథా వీధి నుండి షేక్ రషీద్ రోడ్‌లోకి ప్రవేశించే లెఫ్ట్-టర్న్ ర్యాంప్‌కు ఒక అదనపు లేన్  ఏర్పాటు చేయనున్నారు.

* ఈ ర్యాంప్ సామర్థ్యం గంటకు 1,800 వాహనాలకు పెరుగుతుంది.

* ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రహదారి భద్రతను మెరుగుపరచడానికి, ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి మరియు అల్ జహ్రావి స్ట్రీట్ ఎగ్జిట్ రూట్ మధ్య షేక్ రషీద్ రోడ్‌లోని సర్వీస్ రోడ్ ను అప్డేట్ చేయనున్నారు.

* దుబాయ్-అల్ ఐన్ రోడ్ వైపు వెళ్లేందుకు, షేక్ రషీద్ రోడ్ నుండి ఔద్ మెథా స్ట్రీట్ లోకి ప్రవేశించే రైట్-టర్న్ లేన్‌లు రెండు నుండి మూడుకు పెంచనున్నారు.

* దీంతో రాకపోకల సామర్థ్యం గంటకు 4,000 వాహనాలకు పెరుగుతుంది.

* బుర్ దుబాయ్ వైపు వెళ్లే వాహనదారుల కోసం, ఔద్ మెథా వీధి సర్వీస్ రోడ్‌ను షేక్ రషీద్ రోడ్ ఇంటర్ సెక్షన్ కు ఒక టన్నెల్ కలుపుతుంది.

2. ఔద్ మెథా స్ట్రీట్, అల్ అసాయెల్ స్ట్రీట్ మరియు అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్

* ఈ జంక్షన్ అభివృద్ధిలో భాగంగా మూడు బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇవి అల్ అసాయెల్ స్ట్రీట్, అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ మరియు అల్ ఖైల్ రోడ్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి.

* అల్ అసాయెల్ స్ట్రీట్ నుండి అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ వైపు ప్రయాణించే ట్రాఫిక్ కోసం ఒక రెండు-లేన్ల బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు.

* అల్ ఖైల్ రోడ్ నుండి అల్ అసాయెల్ స్ట్రీట్ వైపు ప్రయాణించే వాహనదారుల కోసం ఒక మూడు-లేన్ల బ్రిడ్జి ఏర్పాటు చేశారు.

* అల్ అసాయెల్ స్ట్రీట్ నుండి ఔద్ మెథా స్ట్రీట్ వైపు ఎడమవైపుకు తిరిగే ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా ఒక రెండు-లేన్ల వంతెన ఉంటుంది.

* ఈ ఎడమవైపు-మలుపు బ్రిడ్జి గంటకు 2,400 వాహనాలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

* అల్ వాస్ల్ క్లబ్‌కు దారితీసే ప్రవేశ రహదారిని మెరుగుపచనుంది.

* ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి క్లబ్ యొక్క ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను కూడా అప్డేట్ చేయనున్నారు.

3. అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ మరియు అల్ ఖైల్ రోడ్

* ఈ జంక్షన్ వద్ద చేపట్టే పనులు, అల్ ఖైల్ రోడ్ మరియు బిజినెస్ బే క్రాసింగ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను మెరుగుపరనుంది. 

* బిజినెస్ బే క్రాసింగ్ దిశగా అల్ అసాయెల్ స్ట్రీట్ నుండి అల్ ఖైల్ రోడ్ వైపు ప్రయాణించే వాహనదారుల కోసం రెండు లేన్ల బ్రిడ్జి నిర్మించారు.

* ఈ బ్రిడ్జిపై గంటకు 3,000 వాహనాలు ప్రయాణించగలవు.

* అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ నుండి అల్ ఖైల్ రోడ్ వైపు వెళ్లే ఎగ్జిట్ మార్గాన్ని రెండు లేన్లకు విస్తరించనున్నారు.

* అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్‌లో ఇరువైపులా ఒక సర్వీస్ రోడ్డు నిర్మిస్తున్నారు.

* వాహనాల పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

4. జబీల్ ప్యాలెస్ స్ట్రీట్, అల్ ఖైల్ రోడ్ మరియు ఔద్ మెథా స్ట్రీట్

* ఈ నాలుగవ జంక్షన్ ఆధునీకరణ, అల్ ఖైల్ రోడ్, దుబాయ్-అల్ ఐన్ రోడ్, ఔద్ మెథా స్ట్రీట్ మరియు అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ మధ్య ట్రాఫిక్ రాకపోకలను మెరుగుపరుస్తుంది.

* అల్ ఖైల్ రోడ్ నుండి దుబాయ్-అల్ ఐన్ రోడ్ వైపు వెళ్లే లెఫ్ట్-టర్న్ ర్యాంప్‌కు ఒక అదనపు లేన్ ను నిర్మించనున్నారు.   

* ఈ ర్యాంప్ సామర్థ్యం గంటకు 900 నుండి 1,800 వాహనాలకు రెట్టింపు అవుతుంది.

* దుబాయ్-అల్ ఐన్ రోడ్ నుండి అల్ వాస్ల్ క్లబ్ స్ట్రీట్ వైపు ప్రయాణించే ట్రాఫిక్ కోసం ఒక లేన్ గల టన్నెల్ ఏర్పాటు చేయబడుతుంది.

* ఈ టన్నెల్ గంటకు 1,200 వాహనాలకు సరిపోతుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది.

* అల్ ఖైల్ రోడ్ నుండి ఔద్ మెథా స్ట్రీట్ వైపు ఉన్న ప్రస్తుత బ్రిడ్జి రెండు లేన్ల నుండి మూడు లేన్లకు విస్తరించబడుతుంది.

* దీని సామర్థ్యం గంటకు 2,200 నుండి 3,300 వాహనాలకు పెరుగుతుంది.

ఈ అభివృద్ధి పనులు షేక్ రషీద్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా చేపడుతున్నారు. దుబాయ్‌లో పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణకు అనుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com