ఒమాన్‌లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- July 28, 2026
మస్కట్: అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు వెళ్లే వారు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఒమాన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) సూచించింది. నేషనల్ రిస్క్ రిజిస్టర్‌తో కలిసి నిర్వహిస్తున్న "వాట్ ఇఫ్?" అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ సూచనలు జారీ చేసింది.
సాహస యాత్రలకు వెళ్లే వారు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన అడ్వెంచర్ టూరిజం సంస్థలు, గుర్తింపు పొందిన గైడ్‌ల సేవలను వినియోగించాలని తెలిపింది. అలాగే అనుమతించిన మార్గాల్లోనే ప్రయాణించడంతో పాటు, ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ముందుగానే తెలియజేయాలని సూచించింది. అత్యవసర పరిస్థితులకు అవసరమైన భద్రతా సామగ్రి, కమ్యూనికేషన్ పరికరాలను వెంట తీసుకెళ్లాలని పేర్కొంది.
ఒకవేళ అడవుల్లో లేదా కొండ ప్రాంతాల్లో దారి తప్పితే భయపడకుండా సురక్షిత ప్రాంతంలోనే ఉండాలని, వెంటనే సంబంధిత అధికారులకు లేదా గైడ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 9999కు కాల్ చేయాలని లేదా 'నిదా' (Nida) ఎమర్జెన్సీ యాప్ ద్వారా తమ లొకేషన్‌ను పంపి సహాయం కోరాలని సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్‌లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్‌లో ట్రాఫిక్‌కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!
- కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్







