చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- July 28, 2026
దోహా: ఖతార్‌లో చిన్నారుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచేందుకు విజిట్ కతార్ సహకారంతో జనరల్ ట్యాక్స్ అథారిటీ (GTA) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. 'హలో సమ్మర్' ప్రచారంలో భాగంగా జరుగుతున్న ఖతార్ టాయ్ ఫెస్టివల్-2026లో 'స్టే హెల్తీ' పేరుతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో 200 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు. అధిక చక్కెర కలిగిన డ్రింక్స్ వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావాల గురించి అవగాహన కల్పించింది. ఏకాగ్రత తగ్గడం, శక్తి స్థాయిల్లో మార్పులు వంటి అంశాలను వారికి సులభంగా అర్థమయ్యేలా వివరించారు.
అలాగే చక్కెర కలిగిన డ్రింక్స్ పై విధించే ఎక్సైజ్ పన్ను ఉద్దేశ్యాన్ని పిల్లలకు వివరించారు. వివిధ ఆటలు, పోటీలు, వినోదాత్మక కార్యక్రమాల ద్వారా వివిధ ఆయా డ్రింక్సుల్లో ఉండే చక్కెర పరిమాణాన్ని గుర్తించేలా అవగాహన కల్పించారు. తక్కువ చక్కెర లేదా చక్కెర లేని డ్రింక్స్ లను ఎంచుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఈసందర్భంగా వివరించారు.
ప్రజారోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడంలో ఎక్సైజ్ ట్యాక్స్ పాత్రను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. చిన్న వయసు నుంచే ఆరోగ్యంపై అవగాహన పెంపొందించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడటమే లక్ష్యమని GTA పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, భాగస్వామ్య సంస్థలతో కలిసి మరిన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని జనరల్ ట్యాక్స్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్‌లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్‌లో ట్రాఫిక్‌కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!
- కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్







