ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!

- July 29, 2026 , by Maagulf
ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!

దోహా: ఖతార్‌లో నకిలీ మెడికల్ లీవ్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో అటార్నీ జనరల్ ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. అధికారిక పత్రాల ఫోర్జరీతో పాటు ప్రభుత్వ నిధులకు నష్టం కలిగించిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగా ఓ ఖతారీ పౌరుడిపై కేసు నమోదు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. నిందితుడు ఖతార్ వెలుపల ఉన్న కొందరితో కుమ్మక్కై, హమద్ మెడికల్ కార్పొరేషన్ పేరుతో నకిలీ మెడికల్ లీవ్ సర్టిఫికెట్లు తయారు చేయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ నకిలీ సర్టిఫికెట్లను పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సమర్పించి అర్హత లేకుండానే సెలవులు పొందినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ సర్టిఫికెట్ల కోసం నిందితుడి ఖాతాకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమకు సమర్పించే మెడికల్ లీవ్ సర్టిఫికెట్ల ప్రామాణికతను తప్పనిసరిగా పరిశీలించాలని, నకిలీ పత్రాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com