మహిళ జీతం క్లెయిమ్‌ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!

- July 31, 2026 , by Maagulf
మహిళ జీతం క్లెయిమ్‌ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!

మనామా: బకాయి జీతాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, పరిహారం కలిపి 1,200 బహ్రెయిన్ దినార్‌లు (BD) చెల్లించాలని ఓ అరబ్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బహ్రెయిన్ లేబర్ కోర్టు కొట్టివేసింది. తాను పెస్ట్ అండ్ ఎపిడెమిక్ కంట్రోల్ స్పెషలిస్ట్ ‌గా నెలకు BD400 జీతంతో పనిచేశానని మహిళ కోర్టుకు తెలిపింది.

అయితే, ఆమెకు ఉద్యోగ హోదా కల్పించేందుకు కాకుండా, ఇన్వెస్టర్ వీసా వచ్చే వరకు నివాస అనుమతి (రెసిడెన్సీ) పొందేందుకు మాత్రమే ఉద్యోగ ఒప్పందాన్ని రూపొందించామని కంపెనీ వాదించింది.సాక్షుల వాంగ్మూలాలు, వాట్సాప్ సందేశాలు, ఈ-మెయిళ్లను పరిశీలించిన కోర్టు.. మహిళ సంస్థలో ఉద్యోగిగా విధులు నిర్వహించలేదని, ఇరు పక్షాల మధ్య సంబంధం ఉద్యోగి-యజమాని సంబంధం కాదని, వ్యాపార భాగస్వామ్యమేనని నిర్ధారించింది. దీంతో మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ, న్యాయపరమైన ఖర్చులు, న్యాయవాదుల ఫీజులను కూడా ఆమెనే చెల్లించాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com