స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- July 31, 2026
దోహా: సోషల్ మీడియా ద్వారా ప్రచారం అవుతున్న "Eatless – Natural Slimming Formula" అనే స్లిమ్మింగ్ ఉత్పత్తిని కొనుగోలు చేయవద్దని, విక్రయించవద్దని, వినియోగించవద్దని ఖతర్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఉత్పత్తిపై నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల్లో సిబుట్రామైన్ (Sibutramine) మరియు ఫీనాల్ఫ్థలీన్ (Phenolphthalein) అనే రెండు పదార్థాలు ప్రకటించకుండా కలిపినట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇది నకిలీ ఉత్పత్తిగా నిర్ధారణ కావడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఖతర్‌లో ఈ ఉత్పత్తికి ఎలాంటి అధికారిక అనుమతి లేదని, సోషల్ మీడియా వేదికల ద్వారా మాత్రమే ప్రచారం జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా సంబంధిత శాఖలతో కలిసి విక్రేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
సిబుట్రామైన్ అనే ఔషధాన్ని గుండె సంబంధిత ప్రమాదాల కారణంగా 2010లో మార్కెట్ నుంచి ఉపసంహరించారని పేర్కొంది. ఇది రక్తపోటు, గుండె వేగాన్ని పెంచడంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు ఉన్న వారికి తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ఫీనాల్ఫ్థలీన్ ప్రస్తుతం ఏ ఆమోదిత ఔషధంలోనూ ఉపయోగించని రసాయనమని, కొన్ని అధ్యయనాల్లో ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశమున్నట్లు వెల్లడైనందున దీని వినియోగం ఆందోళనకరమని తెలిపింది. "100 శాతం సహజం", "సురక్షితం" వంటి ప్రకటనలను నమ్మి నమోదు కాని ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని, ఆరోగ్య శాఖ అనుమతి పొందిన ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలని ఖతర్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది
తాజా వార్తలు
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్‌లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్‌కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- మహిళ జీతం క్లెయిమ్‌ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







