మస్కట్‌లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!

- July 31, 2026 , by Maagulf
మస్కట్‌లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!

మస్కట్: ఒమాన్ రాజధాని మస్కట్‌లోని అల్ జబల్ స్ట్రీట్ (అకాబత్ అల్ అమెరికాత్) ను  తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ వెల్లడించింది. అల్ అమెరికాత్ నుంచి బౌషర్ వైపు వెళ్లే మార్గంలో రాయల్ ఒమాన్ పోలీసులతో కలిసి చేపడుతున్న మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రహదారి పక్కన ఉన్న రక్షణ గోడల సమీపంలోని వదులుగా ఉన్న రాళ్లను తొలగించి, ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ మార్గంలో పూర్తిస్థాయి ట్రాఫిక్ నిలిపివేత  ఆగస్టు 1 (శనివారం) రాత్రి వరకు అమల్లో ఉంటుందని మున్సిపాలిటీ వెల్లడించింది. ఈ కాలంలో వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను వినియోగించాలని, రహదారి సూచికలను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com