కువైట్‌లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- July 31, 2026
కువైట్ : భారతదేశానికి చెందిన ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో (L&T) కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) నుంచి భారీ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద కువైట్‌లోని జురాసిక్ లైట్ ఆయిల్ (JLO) ఎగుమతి సదుపాయాల అభివృద్ధితో పాటు, ప్రస్తుతం ఉన్న ముడి చమురు ఎగుమతి మౌలిక సదుపాయాలను ఆధునికీకరించనుంది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)కు సమర్పించిన వివరాల ప్రకారం.. L&T ఎనర్జీ హైడ్రోకార్బన్ ఆన్‌షోర్ విభాగం ఈ పనులను చేపట్టనుంది. ఇందులో ఒక్కోటి 6.18 లక్షల బ్యారెళ్ల నిల్వ సామర్థ్యం కలిగిన ఆరు కొత్త క్రూడ్ ఆయిల్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణంతో పాటు అనుబంధ సదుపాయాలను టర్న్‌కీ విధానంలో ఏర్పాటు చేయనుంది. అలాగే, కొత్త పైప్లైన్ల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న చమురు లోడింగ్, ఎగుమతి నెట్‌వర్క్‌ను విస్తృతంగా అప్‌గ్రేడ్ చేయడం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది. దీంతో కువైట్ చమురు ఉత్పత్తి, నిల్వ, ఎగుమతి సామర్థ్యం మరింత పెరగనుంది.
ఈ కాంట్రాక్టు విలువను ఎల్అండ్టీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే సంస్థ వర్గీకరణ ప్రకారం ఇది ₹5,000 కోట్ల నుంచి ₹10,000 కోట్ల (సుమారు 522 మిలియన్ నుంచి 1.04 బిలియన్ అమెరికన్ డాలర్లు) మధ్య విలువైన "మేజర్" ప్రాజెక్టుగా పేర్కొంది. ఇదివరకు జూన్‌లో కువైట్ సెంట్రల్ ఏజెన్సీ ఫర్ పబ్లిక్ టెండర్స్ (CAPT) సుమారు 303.5 మిలియన్ కువైటీ దినార్లు (దాదాపు 992 మిలియన్ అమెరికన్ డాలర్లు) విలువైన ఈ ప్రాజెక్టును ఎల్అండ్టీకి కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్‌లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్‌కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- మహిళ జీతం క్లెయిమ్‌ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







