బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- July 31, 2026
ప్రపంచ ప్రసిద్ధ నేపాల్ పర్వతారోహకుడు, అనేక అరుదైన రికార్డుల విజేత నిర్మల్ పుర్జా (Nimsdai) సహా 10 మంది పర్వతారోహకులు పాకిస్తాన్‌లోని ‘బ్రాడ్ పీక్’ (Broad Peak) వద్ద సంభవించిన భారీ హిమపాతం (Avalanche) లో చిక్కుకుని గల్లంతయ్యారు. గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఆల్పైన్ క్లబ్ ఆఫ్ పాకిస్తాన్ (Alpine Club of Pakistan) అందించిన సమాచారం ప్రకారం.. హిమపాతం సంభవించినప్పటి నుంచి పర్వతారోహకులతో ఎటువంటి సంబంధాలు (Contact) పునరుద్ధరణ కాలేదు.
కారాకోరం పర్వత శ్రేణిలోని 8,051 మీటర్ల ఎత్తున్న ‘బ్రాడ్ పీక్’ శిఖరాగ్రానికి చేరుకునే క్రమంలో నిర్మల్ పుర్జా నేతృత్వంలోని బృందం క్యాంప్ 2 నుండి క్యాంప్ 3 కి వెళ్తుండగా మధ్యాహ్నం సమయంలో భారీగా హిమపాతం విరుచుకుపడింది. ఈ బృందంలో నిర్మల్ పుర్జాతో పాటు తొమ్మిది మంది ఇతర పర్వతారోహకులు ఉన్నారు.
రెస్క్యూ ఆపరేషన్ & ఆశల కిరణం
హెలికాప్టర్ రెస్క్యూ సిద్ధం: స్కార్దూ (Skardu) కేంద్రంగా సెర్చ్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. అయితే ఆ ప్రాంతంలో వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉండటంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోంది.
రెండు మృతదేహాలు లభ్యం: నివేదికల ప్రకారం హిమపాతం సంభవించిన ప్రాంతంలో రెండు మృతదేహాలను గుర్తించారు. కానీ వారి వివరాలు ఇంకా ఖరారు కావలసి ఉంది.
ట్రాకింగ్ డివైజ్‌లో సైన్: ప్రమాదం జరిగిన తర్వాత కూడా నిర్మల్ పుర్జా ధరించిన జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్ (Tracking Device) లో కదలికలు నమోదయ్యాయి. దీంతో ఆయన సురక్షితంగా జీవించి ఉండే అవకాశాలు ఉన్నాయని రెస్క్యూ టీమ్‌లు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ పుర్జా ఎవరు?
నేపాల్‌లో జన్మించిన నిర్మల్ పుర్జా గోర్ఖా రెజిమెంట్, యుకే స్పెషల్ ఫోర్సెస్ (SBS) లో 16 సంవత్సరాల పాటు ఆర్మీ అధికారిగా సేవలు అందించారు. తక్కువ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద 14 ఎనిమిది వేల మీటర్ల (8000m+) ఎత్తున్న శిఖరాలను అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని 8,000 మీటర్ల కంటే ఎత్తైన శిఖరాలను మూడోసారి (Thrice) అధిరోహించిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించే క్రమంలో ఈ ‘బ్రాడ్ పీక్’ దండయాత్ర చేపట్టారు.
తాజా వార్తలు
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్‌లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్‌కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- మహిళ జీతం క్లెయిమ్‌ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







