ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- July 31, 2026
మస్కట్: మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఒమన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 2025లో అమల్లోకి వచ్చిన మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం ప్రకారం మానవ అక్రమ రవాణా కేసుల్లో దోషులుగా తేలిన వారికి మూడు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష, 5,000 నుంచి 100,000 ఒమానీ రియాల్స్ వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
నేరం పిల్లలకు సంబంధించినదైతే, వ్యవస్థీకృత నేర ముఠా పాల్పడితే లేదా ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లయితే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏడు నుంచి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు చట్టంలో నిబంధనలను పొందుపరిచారు. అంతేకాకుండా, నేరానికి ఉపయోగించిన ఆస్తులు, పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు మానవ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు తేలిన కంపెనీల కార్యకలాపాలను నిలిపివేసే అధికారాన్ని కూడా కోర్టులకు కల్పించారు.
జూలై 30న నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ చట్టంలోని శిక్షలను రాయల్ ఒమాన్ పోలీస్ గుర్తు చేసింది. బాధితుల రక్షణ, నేరస్థులపై కఠిన చర్యలు, మానవ అక్రమ రవాణా అన్ని రూపాలను అరికట్టడంలో ఒమాన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







