విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- August 01, 2026
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు. జూలై 31న కమిషనరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు తమ సుదీర్ఘ సేవా కాలంలో ప్రజలకు, పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించారని ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసేవ, నేర నియంత్రణతో పాటు శాఖ అభివృద్ధికి వారు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీపీ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. అలాగే తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, సహచర అధికారులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. డీసీపీ (అడ్మిన్) టి. అన్నపూర్ణ, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్ డీసీపీ కె. పుష్ప, డీసీపీ (కార్ హెడ్‌క్వార్టర్స్) పి. సంజీవ్, ఏడీసీపీ షమీర్, సీఏఓ (అకౌంట్స్) వెంకట్ రెడ్డి, ఏఓ (అడ్మిన్) వై.వి.ఎస్. జ్యోతిర్మణి, ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ఐ హిమాకర్, కో-ఆపరేటివ్ సొసైటీ ఇన్చార్జి ఎస్ఐ జి. మల్లేశం తదితరులు హాజరై విరమణ పొందిన అధికారులను సత్కరించారు.
విరమణ పొందిన అధికారులు
- ఎస్ఐ ఆర్. కిషన్ సింగ్ – మొయినాబాద్ పోలీస్ స్టేషన్
- ఎస్ఐ ఎల్. రాజేశ్వర్ – షాద్‌నగర్ పోలీస్ స్టేషన్
- ఆర్ఎస్ఐ మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ – సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్
- ఆర్ఎస్ఐ మహమ్మద్ మక్సూద్ ఘౌరీ – సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్
- ఆర్ఎస్ఐ మహమ్మద్ అబ్దుల్ జలీల్ – సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్
- ఎస్ఐ మహమ్మద్ నూర్ ఉద్దీన్ – ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
- హెడ్ కానిస్టేబుల్ గెనుగుల రమేష్ – రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్
వీడ్కోలు కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, విరమణ పొందిన అధికారుల సేవలను సహచరులు గుర్తు చేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







