డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- August 01, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడానికి రవాణా శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేవలం వాహనం నడపడం వచ్చు అనే కారణంతో శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే పాత పద్ధతికి స్వస్తి పలుకుతోంది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సూచనల మేరకు, రోడ్డు నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న అభ్యర్థులకే ఇకపై శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆన్లైన్ ఉచిత శిక్షణ, వీడియో మాడ్యూల్స్:
కొత్త నిబంధనల ప్రకారం, లెర్నర్ లైసెన్స్ పొందిన వారు డ్రైవింగ్ టెస్ట్(Driving Licence New Rules)కు దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా ఆన్లైన్ రోడ్డు భద్రతా శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 64 భద్రతా నియమాలు, 120కి పైగా వీడియోలతో ఆరు భాగాలుగా ఈ కోర్సును రూపొందించారు. అభ్యర్థులు తమ వద్ద ఉన్న మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఇంటి నుంచే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఈ శిక్షణను ఉచితంగా పూర్తి చేయవచ్చు. ముఖ గుర్తింపు ఆధారంగా సాగే ఈ కోర్సులో ఒక్కో మాడ్యూల్ తర్వాత ఒక చిన్న పరీక్ష ఉంటుంది.
సురక్షిత ప్రయాణం కోసం విస్తృత అవగాహన:
ఈ శిక్షణా కోర్సులో సీట్‌బెల్ట్ వినియోగం, హ్యాండ్‌బ్రేక్ సరైన ఉపయోగం, రాత్రివేళ లైట్ల వినియోగం, మహిళల భద్రత, పిల్లల సురక్షిత ప్రయాణం వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పిస్తారు. అన్ని మాడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసిన వారికి మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కూకట్పల్లి ఆర్టీవో పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసి సఫలీకృతమైన ఈ విధానాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







