ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- August 01, 2026
మనామా: బహ్రెయిన్‌లోని ప్రముఖ వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన ఇసా టౌన్ మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మార్కెట్‌కు వచ్చే వినియోగదారుల సౌకర్యం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, స్థానిక వ్యాపారాల అభివృద్ధి లక్ష్యంగా 500 కొత్త పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ గవర్నరేట్ రెండో నియోజకవర్గ ఎంపీ డాక్టర్ మర్యం అల్ ధైన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు దక్షిణ గవర్నరేట్‌లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమని తెలిపారు.
కొత్త పార్కింగ్తో పాటు రమీజ్ షాపింగ్ సెంటర్ విస్తరణ, మార్కెట్లో విద్యుత్ కేబుళ్ల మార్పు, ఆధునిక లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు, ప్రైవేట్ పెట్టుబడులకు కొత్త స్థలాల కేటాయింపు, శుద్ధి చేసిన నీటి (ట్రీటెడ్ వాటర్) నెట్వర్క్ అనుసంధానం వంటి పనులు కూడా చేపడుతున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే కొనుగోలుదారులు సులభంగా మార్కెట్‌కు చేరుకోవడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తగ్గి, స్థానిక వ్యాపారులకు మరింత ఆదరణ లభిస్తుందని డాక్టర్ మర్యం అల్ ధైన్ తెలిపారు.
ఇసా టౌన్ షాపింగ్ సెంటర్ విస్తరణ కోసం సదర్న్ మునిసిపాలిటీ మరియు రమీజ్ గ్రూప్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు వల్ల మెరుగైన రిటైల్ సేవలు, అధిక సంఖ్యలో వినియోగదారులు, స్థానిక వ్యాపారాల వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్‌లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







