నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- August 01, 2026
మస్కట్: పాకిస్థాన్‌లో జరిగిన విషాదకర హిమపాతంలో ఒమాన్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు నదీరా బింట్ అహ్మద్ అల్ హర్తీ మృతి చెందడంతో ఒమాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నదీరా అల్ హర్తీ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు పాకిస్థాన్ సంబంధిత అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కాన్సులర్ విభాగం ప్రతినిధి వెల్లడించారు.
నదీరా అల్ హర్తీ ఒమాన్–నేపాల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తూ, ఒమాన్ మరియు నేపాల్ మధ్య మానవతా, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేశారు. రెండు దేశాల ప్రజల మధ్య స్నేహబంధం, సహకారం పెంపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు విదేశాంగ శాఖ కొనియాడింది.
సమాజ సేవ, సాంస్కృతిక మార్పిడి, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న మంత్రిత్వ శాఖ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. అల్లాహ్ ఆమెకు శాశ్వత శాంతిని ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించింది.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్‌లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







