ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!

- September 17, 2026 , by Maagulf
ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!

దోహా: ఖతార్‌లో కొన్ని దిగుమతి వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమిరీ డిక్రీ నంబర్ 45 ఆఫ్ 2026 ప్రకారం ఈ మార్పులు చేయగా, సెప్టెంబర్ 16, 2026న ప్రచురించిన అధికారిక గెజిట్ 17వ సంచికలో వివరాలను వెల్లడించారు.

చికెన్‌పై 18% సుంకం
కొత్త డిక్రీ ప్రకారం కట్ చేయని తాజా లేదా ఫ్రీజింగ్ చికెన్‌పై కస్టమ్స్ డ్యూటీ 18 శాతానికి పెంచారు. అలాగే కొన్ని కూరగాయలపై 15% సుంకం పెంచారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో భాగంగా జుక్కిని, వంకాయలు, టమాటాలపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి పెంచారు. అయితే ఈ పెరిగిన డ్యూటీ ఆయా కూరగాయల స్థానిక వ్యవసాయ ఉత్పత్తి అధికంగా ఉండే నిర్దిష్ట కాలాల్లో మాత్రమే వర్తిస్తుంది.

సీజన్ వారీగా పెంచిన డ్యూటీ వర్తించే కాలాలు:
- టమాటాలు: జనవరి నుంచి మే వరకు
- వంకాయలు: జనవరి నుంచి ఏప్రిల్ వరకు, అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు
- జుక్కిని: జనవరి నుంచి ఏప్రిల్ వరకు, అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
60 రోజుల తర్వాత అమలు
ఈ కొత్త కస్టమ్స్ సుంకాలు అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి 60 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. కొత్త నిర్ణయం ప్రకారం చికెన్‌తో పాటు కొన్ని కూరగాయల దిగుమతులపై నిర్దిష్ట కాలాల్లో అధిక సుంకాలు విధించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com