అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!

- August 02, 2026 , by Maagulf
అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!

రియాద్: సౌదీ అరేబియా రక్షణ శాఖ కార్యనిర్వాహక వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఖాలిద్ అల్-బియారి అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సైనిక పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ప్రాంతీయ భద్రత అంశాలపై కీలక చర్చలు జరిపారు. పర్యటనలో భాగంగా ఆయన తొలుత అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) డైరెక్టర్ మేరీ మోర్గాన్ ‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ పరిశ్రమల్లో సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం పెంటగాన్‌లో అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ అక్విజిషన్ అండ్ సస్టైన్‌మెంట్ మైఖేల్ డఫీ, అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ పాలసీ ఎల్బ్రిడ్జ్ కోల్బీ, అండర్ సెక్రటరీ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ జెంట్రీ స్టీఫెన్ ‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు.

ఈ సమావేశాల్లో సౌదీ-అమెరికా రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి ప్రయోజనాలు మరియు ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి. అలాగే అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ థామస్ డినానో తో కూడా అల్-బియారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సౌదీ-అమెరికా సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఇరు దేశాల పాత్రపై అభిప్రాయాలు పంచుకున్నారు. పర్యటన చివర్లో అమెరికాలోని ప్రముఖ రక్షణ సంస్థల సీఈవోలతో అల్-బియారి సమావేశమయ్యారు. సౌదీ విజన్-2030 లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ పరిశ్రమలు, పరిశోధన-అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, స్థానికీకరణ (లోకలైజేషన్) రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com