75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- August 03, 2026
బురైదా: సౌదీ అరేబియాలోని బురైదా నగరంలో అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్ (Buraidah International Dates Carnival) ఘనంగా ప్రారంభమైంది. పామ్ సెంటర్‌కు దక్షిణ భాగంలో ప్రారంభమైన ఈ వేడుకకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులు, వ్యాపారులు, దిగుమతిదారులు తరలివచ్చారు. ఖాసిం ప్రాంత గవర్నర్ ప్రిన్స్ డాక్టర్ ఫైసల్ బిన్ మిషాల్ ఆధ్వర్యంలో, నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ నిర్వహిస్తున్న ఈ కార్నివాల్ అక్టోబర్ 14 వరకు(75 రోజుల పాటు) కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డేట్స్ మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ వార్షిక వేడుకకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం లభించింది.
ఖాసిం ప్రాంతం డేట్స్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు 11 మిలియన్ల డేట్స్ చెట్లు ఉండగా, ప్రతి ఏడాది దాదాపు 5.78 లక్షల టన్నుల డేట్స్ ఉత్పత్తి అవుతున్నాయి. డేట్స్ ఇండస్ట్రీ ద్వారా సంవత్సరానికి సుమారు 3.2 బిలియన్ సౌదీ రియాల్స్ ఆర్థిక ఆదాయం లభిస్తోందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్నివాల్లో డేట్స్ విక్రయాలతో పాటు ఖాసిం ప్రాంత వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక, పర్యాటక, వినోద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్‌లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి
- మెట్రాష్ యాప్‌తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!
- భారత్ లో ఒక్కో యూజర్ నెలకు 50 గంటలు ఇన్స్టాలోనే!
- సెప్టెంబర్‌లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!







