ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!
- August 03, 2026
రియాద్: ఒబెసిటీతో బాధపడుతున్న పెద్దలకు దీర్ఘకాలికంగా బరువు తగ్గించడంతో పాటు తగ్గిన బరువును కొనసాగించేందుకు ఉపయోగించే తొలి ఓరల్ డ్రగ్ ఫౌండాయో (Foundaio) నమోదుకు సౌదీ ఆహార, ఔషధ ప్రాధికార సంస్థ (SFDA) ఆమోదం తెలిపింది. ఆర్ఫోర్గ్లిప్రాన్ (Orforglipron) అనే పదార్థం కలిగిన ఈ మెడిసిన్ ను ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు ఉపయోగించాలని ఎస్ఎఫ్డీఏ సూచించింది. ఒబెసిటీ లేదా అధిక బరువుతో పాటు కనీసం ఒక బరువు సంబంధిత ఆరోగ్య సమస్య ఉన్న పెద్దలకు ఈ మందు ఉపయోగపడుతుందని వెల్లడించింది.
ఈ మెడిసిన్ గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1 (GLP-1) రిసెప్టర్లను ఉత్తేజపరచడం ద్వారా ఆకలిని నియంత్రించడంతో పాటు రక్తంలో షుగర్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో ఆహారం తీసుకునే పరిమాణం తగ్గి, దీర్ఘకాలికంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇతర జీఎల్పీ-1 చికిత్సలతో పోలిస్తే ఇది రోజుకు ఒక్కసారి నోటి ద్వారా తీసుకునే పిల్ కావడం విశేషం. ఈ మెడిసిన్ భద్రత, ప్రభావం, నాణ్యతపై సమగ్ర పరిశీలన అనంతరం 72 వారాల పాటు నిర్వహించిన రెండు కీలకమైన మూడో దశ క్లినికల్ పరీక్షల ఫలితాల ఆధారంగా అనుమతి మంజూరు చేసినట్లు ఎస్ఎఫ్డీఏ తెలిపింది.
ఈ మందు వాడినవారిలో వికారం, మలబద్ధకం, విరేచనాలు, వాంతులు, అజీర్ణం, కడుపునొప్పి వంటి జీర్ణాశయ సంబంధిత దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపించాయని ఎస్ఎఫ్డీఏ తెలిపింది. అలాగే కడుపు ఉబ్బరం, జుట్టు రాలడం, అలసట వంటి సమస్యలు కూడా కొందరిలో నమోదయ్యాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా స్వల్ప లేదా మధ్యస్థ స్థాయిలో ఉండి, మోతాదు పెంచే ప్రారంభ దశలోనే కనిపించి అనంతరం తగ్గిపోయాయని పేర్కొంది.
కాగా, కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్ వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారు, అలాగే సంబంధిత వంశపారంపర్య వ్యాధులు ఉన్నవారు ఈ మందును వాడరాదని ఎస్ఎఫ్డీఏ హెచ్చరించింది. వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పని వైద్య పరీక్షలతో మాత్రమే ఈ చికిత్స కొనసాగించాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌కు భారత కొత్త కాన్సుల్ జనరల్‌గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం
- హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే
- ఖతార్‌లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!
- కువైట్‌లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్‌లు..!!
- ఖరీఫ్ సీజన్‌కు దోఫార్‌లో కట్టుదిట్టమైన భద్రత..!!
- అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!







