ఖతార్‌లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- August 03, 2026
దోహా: స్మార్ట్ రవాణా వ్యవస్థ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేస్తూ ఖతార్ డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ రోబోటాక్సీల (Robotaxi) పరీక్షలను తదుపరి దశకు తీసుకెళ్లింది. తొలి దశలో నిర్వహించిన 2500 ప్రయాణాల్లో 94 శాతానికి పైగా విజయవంతమైన ఫలితాలు నమోదు కావడంతో, ఇప్పుడు వాహనాల్లో భద్రతా డ్రైవర్ లేకుండానే ట్రయల్స్ ప్రారంభించినట్లు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రవాణా మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ ఇంజినీరింగ్, రోడ్డు భద్రత విభాగాధిపతి మొహమ్మద్ జాసిం అల్ షైబానీ మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ టాక్సీల్లో కృత్రిమ మేధస్సు (AI), లిడార్ (LiDAR) సెన్సర్లు, అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలను అమర్చినట్లు తెలిపారు. ఇవి రహదారిని, పరిసరాలను నిరంతరం విశ్లేషిస్తూ మానవ జోక్యం లేకుండానే సురక్షితంగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. సాధారణ కార్లతో పోలిస్తే ఈ వాహనాల పైభాగంలో ఉండే ప్రత్యేక పరికరాలే స్మార్ట్ నావిగేషన్, నిర్ణయాల వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తాయని ఆయన వివరించారు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి దశను క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరమే తదుపరి దశకు వెళ్లినట్లు తెలిపారు.
ఖతార్‌లో భవిష్యత్తులో ప్రజా రవాణాను మరింత ఆధునికంగా, సురక్షితంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ రోబోటాక్సీ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవంతమైన పరీక్షల అనంతరం దశలవారీగా ఈ సేవలను ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







