ఖరీఫ్ సీజన్‌కు దోఫార్‌లో కట్టుదిట్టమైన భద్రత..!!
- August 03, 2026
మస్కట్: ఖరీఫ్ దోఫార్ పర్యాటక సీజన్ నేపథ్యంలో సందర్శకుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం రాయల్ ఒమాన్ పోలీస్ (ROP) విస్తృత ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వాడి హరీత్ పోలీస్ స్టేషన్ చెక్‌పాయింట్ నుంచి ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్లు చెడిపోవడం లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు వాహనదారులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెంటనే తెలుసుకునేందుకు ప్రత్యేక QR కోడ్‌ను అందుబాటులో ఉంచారు. మొబైల్‌తో కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రత్యామ్నాయ మార్గాల మ్యాప్ వెంటనే అందుబాటులోకి వస్తుంది.
సలాలా విలాయత్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దోఫార్ మునిసిపాలిటీతో కలిసి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద అత్యంత రద్దీ ఉన్న లేన్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డ్రిఫ్టింగ్, ప్రమాదకర స్టంట్ డ్రైవింగ్, పచ్చిక ప్రాంతాల్లో వాహనాలు నడపడం, రహదారి పక్క భాగం నుంచి ఓవర్టేక్ చేయడం, ప్రయాణంలో కిటికీలు లేదా సన్‌రూఫ్ నుంచి బయటకు వంగడం వంటి ప్రమాదకర చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి ఉల్లంఘనలపై ట్రాఫిక్ చట్టాల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఖరీఫ్ సీజన్లో బీచ్‌ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు దోఫార్ కోస్ట్ గార్డ్ పోలీస్ యూనిట్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ అలావీ హాఫిధ్ అల్ హద్దాద్ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే బీచ్‌లలో అదనపు సిబ్బందితో పాటు ఆల్-టెర్రెయిన్ వాహనాలు, జెట్ స్కీలను మోహరించినట్లు చెప్పారు. సముద్రంలో ఎత్తైన అలలు, బలమైన ప్రవాహాల కారణంగా సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మునిగిపోవడం, రాతి కొండలపై నుంచి జారిపడే ప్రమాదాలను నివారించాలని సూచించారు.
పర్యాటక ప్రాంతాల్లో, ముఖ్యంగా సాధారణ పోలీసు వాహనాలు చేరలేని ప్రాంతాల్లో గుర్రపు దళాలతో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నట్లు మౌంటెడ్ పోలీస్ అధికారులు తెలిపారు. ఖరీఫ్ ఉత్సవాల సమయంలో పిల్లలు తప్పిపోవడం వంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నందున తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వాహనదారులు అతివేగానికి దూరంగా ఉండాలని, అలసటగా అనిపిస్తే తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రాయల్ ఒమాన్ పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌కు భారత కొత్త కాన్సుల్ జనరల్‌గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం
- హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే
- ఖతార్‌లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!
- కువైట్‌లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్‌లు..!!
- ఖరీఫ్ సీజన్‌కు దోఫార్‌లో కట్టుదిట్టమైన భద్రత..!!
- అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!







