కువైట్‌లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్‌లు..!!

- August 03, 2026 , by Maagulf
కువైట్‌లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్‌లు..!!

కువైట్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్, మిడ్‌వైఫరీ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్‌లను మంజూరు చేస్తూ కువైట్ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య మంత్రి జారీ చేసిన మంత్రి స్థాయి ఉత్తర్వుల మేరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి నెలవారీ భత్యాలు, ప్రోత్సాహకాలను పెంచారు. విధుల స్వభావం, బాధ్యతలు, హోదా ఆధారంగా నెలవారీ అలవెన్సులు, బోనస్‌లు చెల్లించనున్నారు. కొన్ని ఉన్నత స్థాయి నర్సింగ్ పదవుల్లో పనిచేసే వారికి నెలకు గరిష్ఠంగా 1,510 కువైట్ దినార్ల వరకు అలవెన్సులు లభించనున్నట్లు వెల్లడైంది. అలాగే వారి విద్యా అర్హతలను బట్టి ప్రతినెలా 500 కువైట్ దినార్ల వరకు బోనస్ లభించనుంది.

ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని, ప్రతిభావంతులైన నర్సులను ప్రభుత్వ సేవల్లో కొనసాగించడంతో పాటు ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. కొత్త భత్యాలు, బోనస్‌ల అమలుకు సంబంధించిన విధివిధానాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో సంబంధిత ఆరోగ్య సంస్థలకు తెలియజేయనుంది. ఈ నిర్ణయంతో కువైట్‌లోని వేలాది మంది నర్సింగ్ సిబ్బంది ప్రయోజనం పొందనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com