హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- August 03, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం, రాత్రి వేళల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నగర వాసులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సీపీ వీసీ సజ్జనార్ నగర వాసులకు ట్విటర్ వేదికగా కీలక సూచనలు చేశారు.
‘నగరంలో ఇవాళ రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగేలోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి. ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి’ అంటూ సజ్జనార్ ట్వీట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!
- ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం.. 9 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత కేరళ ప్రవాసికి రూ.1.36 లక్షల పరిహారం
- కువైట్‌లో బ్యాంక్ కార్డుల వినియోగం జోరు..!!
- నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు
- గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్‌లో రియాద్‌కు చోటు..!!
- రష్యా, పాకిస్తాన్లో ఉగ్రదాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- ఆగస్టు 15 నుంచి ఖతార్‌లో కనాద్ చేపల వేటపై నిషేధం..!!
- 2035 నాటికి 33 శాతం ఉద్గారాల తగ్గింపే లక్ష్యం..!!
- తైపే–హైదరాబాద్–దుబాయ్ కార్గోకు ఎమిరేట్స్ స్కైకార్గో ప్రత్యేక బోయింగ్ 777 ఫ్రైటర్ సేవలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు







