17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!
- August 04, 2026
అబుదాబి: పర్యావరణ నేరాలపై యూఏఈ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ షీల్డ్–2026 ఘన విజయాన్ని సాధించింది. కేవలం 17 రోజుల వ్యవధిలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఆపరేషన్‌లో 839 మందిని అరెస్ట్ చేయగా, 280 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా విలువైన ఆస్తులు, పరికరాలు, ఇతర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
యూఏఈ ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ వివరాలను 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. మొత్తం 1,045 ఫీల్డ్ ఆపరేషన్లు నిర్వహించి పర్యావరణ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెరుగుతున్న పర్యావరణ నేరాలను అరికట్టేందుకు యూఏఈ ఆధ్వర్యంలో జూలైలో కొలంబియా, ఈక్వడార్, పెరూ, బొలీవియా, బ్రెజిల్ దేశాల సహకారంతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు.
ప్రపంచంలో అత్యంత కీలకమైన జీవవైవిధ్య ప్రాంతమైన అమెజాన్ బేసిన్ పరిధిలో ఈ భారీ బహుళ దేశాల సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా యూఏఈ 2023లో ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ కార్యాలయం (UNODC)తో కలిసి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ క్లైమేట్ (I2LEC) కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఆపరేషన్ గ్రీన్ షీల్డ్–2026 విజయం ద్వారా వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాలను కార్యాచరణలోకి తీసుకువచ్చి స్పష్టమైన ఫలితాలు సాధించే సామర్థ్యం యూఏఈకి ఉందని షేక్ సైఫ్ పేర్కొన్నారు. అలాగే సరిహద్దులు దాటి జరిగే పర్యావరణ నేరాలను అరికట్టేందుకు, సహజ పర్యావరణ వ్యవస్థలను భావితరాలకు పరిరక్షించేందుకు ఈ ఆపరేషన్ ఆదర్శవంతమైన నమూనాగా నిలిచిందని తెలిపారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







