రష్యా, పాకిస్తాన్లో ఉగ్రదాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- August 04, 2026
మనామా: రష్యా, పాకిస్తాన్లో జరిగిన రెండు వేర్వేరు ఉగ్రదాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు అత్యంత హేయమైనవని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రష్యా రాజధాని మాస్కోలోని కుద్రిన్స్కయా స్క్వేర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో అమర్చిన ఐఈడీ పేలడంతో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. అలాగే, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో ఓ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.
ఈ రెండు ఘటనలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేసింది. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పుగా నిలిచే అన్ని రకాల ఉగ్రవాదాన్ని బహ్రెయిన్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ఇటువంటి హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!







