యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- August 03, 2026
అబుదాబి: సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ బ్రాడ్‌కాస్ట్) సందర్భంగా యూఏఈ సంస్కృతి, సామాజిక విలువలను అవమానించే కంటెంట్‌ను ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై యూఏఈ నేషనల్ మీడియా అథారిటీ (NMA) చట్టపరమైన చర్యలు తీసుకుంది.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఇద్దరు వ్యక్తులు లైవ్ ప్రసారంలో యూఏఈ సంస్కృతి, నాగరిక వారసత్వం, జాతీయ గుర్తింపును అవమానించేలా కంటెంట్‌ను ప్రసారం చేసినట్లు గుర్తించినట్లు ఎన్‌ఎంఏ తెలిపింది. అంతేకాకుండా, ఆ కంటెంట్ సమాజంలో నెలకొన్న విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు ప్రారంభించడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఒకరికి జారీ చేసిన పబ్లిసిటీ పర్మిట్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా నేషనల్ మీడియా అథారిటీ స్పష్టం చేస్తూ, సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ వేదికలను కేవలం ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు లేదా ఎంగేజ్‌మెంట్ కోసం సమాజ విలువలను దెబ్బతీసేలా ఉపయోగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించింది.
అలాగే సమాజంలో వివాదాలు సృష్టించే, యూఏఈ జాతీయ గుర్తింపు, విలువలు, సంప్రదాయాలను దెబ్బతీసే కంటెంట్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎన్‌ఎంఏ పేర్కొంది.
డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దేశ చట్టాలు, సామాజిక విలువలు, సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవిస్తూ కంటెంట్‌ను ప్రచురించాలని నేషనల్ మీడియా అథారిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం
- దుబాయ్‌కు భారత కొత్త కాన్సుల్ జనరల్‌గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం
- హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే







