'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- August 03, 2026
విజయవాడ: గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో "మన అమరావతి" థీమ్‌తో నిర్వహిస్తున్న స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమం రాష్ట్ర ప్రతిష్ఠను, అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటిచెప్పే విశిష్ట వేదికగా నిలుస్తుందని శాసనమండలి సభ్యులు బిజెపి జాతీయ కార్య వర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు.
సోమవారం విజయవాడలోని భారతీనగర్‌లోని తమ కార్యాలయంలో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026 గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రతిభకు గౌరవం సమాజానికి స్ఫూర్తి
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులను గుర్తించి వారికి స్టేట్ ఐకాన్స్ అవార్డులు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచేలా వారిని గౌరవించడం ఒక గొప్ప సంప్రదాయమని తెలిపారు.
నిర్వాహకులకు అభినందనలు
ఈ సందర్భంగా గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ అధ్యక్షుడు చైతన్య జంగా, కార్యదర్శి జయా పటేరియా, ఉపాధ్యక్షుడు మిత్తాన ఈశ్వర్, సంయుక్త కార్యదర్శి కోడే శ్రీచైతన్య, ట్రెజరర్ రామిశెట్టి అప్పారావులను ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందించారు.
ఆగస్టు 8న హయ్యత్ ప్లేస్‌లో వైభవంగా స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
ఈ సందర్భంగా గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ అధ్యక్షుడు చైతన్య జంగా, కార్యదర్శి జయా పటేరియా మాట్లాడుతూ, ఆగస్టు 8న విజయవాడ గుణదలలోని హయ్యత్ ప్లేస్‌లో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి, రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ & సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ప్రొటోకాల్ ఛైర్మన్ పాతూరి నాగభూషణం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.
అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చారిత్రాత్మకం
గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ అధ్యక్షుడు చైతన్య జంగా మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో, సంకల్పబలంతో చేస్తున్న కృషి చారిత్రాత్మకమని కొనియాడారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు.
అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు గర్వకారణంగా నిలిచే ప్రపంచ స్థాయి నగరంగా అవతరిస్తోందని పేర్కొన్నారు. అమరావతి బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేలా చేయాలనే సంకల్పంతోనే "మన అమరావతి" థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులను ఒకే వేదికపై ఘనంగా సత్కరించడం ద్వారా సమాజానికి స్ఫూర్తినివ్వడంతో పాటు, అమరావతి గొప్పతనాన్ని దేశ విదేశాలకు చాటిచెప్పే ప్రయత్నమే ఈ కార్యక్రమం లక్ష్యమని చైతన్య జంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ ఉపాధ్యక్షుడు మిత్తాన ఈశ్వర్, సంయుక్త కార్యదర్శి కోడే శ్రీచైతన్య, ట్రెజరర్ రామిశెట్టి అప్పారావు,ప్రముఖ కమెడియన్ డా.భద్రం,కమిటీ సభ్యులు డా.ఎ.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం
- దుబాయ్‌కు భారత కొత్త కాన్సుల్ జనరల్‌గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం







