కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- August 03, 2026
హైదరాబాద్: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతి చెందిన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ కుటుంబానికి తెలంగాణ పోలీస్ శాఖ అండగా నిలిచింది. కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి విలువైన బీమా చెక్కును తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చరణ్‌కుమార్ 2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా మల్కాజిగిరి కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తూ, డిప్యూటేషన్‌పై ఈగల్ ఫోర్స్‌లో సేవలందిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 22-23 తేదీల అర్ధరాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో చరణ్‌కుమార్‌కు కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా, కొంతకాలం చికిత్స అనంతరం 2025 అక్టోబర్ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే తిరిగి యశోద ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







