దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ బేకర్‌కు బిగ్ టికెట్‌లో Dh20 మిలియన్ల జాక్‌పాట్..!!
- August 04, 2026
అబుదాబి: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరించుతుందో చెప్పలేం. దుబాయ్‌లో బేకర్‌గా పనిచేస్తున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన రేనాల్డో హెర్బోసో 15 ఏళ్లుగా నిరంతరం బిగ్ టికెట్ కొనుగోలు చేస్తూ వచ్చిన తన ప్రయత్నానికి ఎట్టకేలకు భారీ ఫలితం దక్కింది. ఆగస్టు 3న జరిగిన బిగ్ టికెట్ అబుదాబి లైవ్ డ్రాలో ఆయన Dh20 మిలియన్ల (సుమారు రూ.45 కోట్లకు పైగా) గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. జూలై 13న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 267822 ఈ నెల జాక్‌పాట్ విజేతగా ఎంపికయ్యాడు.
రేనాల్డో గత 15 ఏళ్లుగా ప్రతి నెలా తనతో పాటు ఫిలిప్పీన్స్, భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన మొత్తం 10 మంది స్నేహితులతో కలిసి బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నారు. ఈసారి విజేత టికెట్ నంబర్‌ను వారి బంగ్లాదేశ్‌కు చెందిన స్నేహితుడు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.విజయం గురించి నిర్వాహకులు ఫోన్ చేసి తెలియజేయగానే మొదట నమ్మలేకపోయానని రేనాల్డో చెప్పారు. "నిజంగానే నేను గెలిచానా?" అని ఆశ్చర్యపోయానని, 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ బృందానికి ఈ అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గ్రాండ్ ప్రైజ్‌గా వచ్చిన Dh20 మిలియన్లను 10 మంది సభ్యులు సమానంగా పంచుకోనున్నట్లు రేనాల్డో వెల్లడించారు. తనకు వచ్చే వాటాను ఎలా వినియోగించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కొంత సమయం తీసుకుని ఆలోచిస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఈ డ్రాలో మరో ఐదుగురు విజేతలకు తలా Dh100,000 కన్సొలేషన్ బహుమతులు లభించాయి. అలాగే అబుదాబిలో నివసిస్తున్న నేపాల్ ప్రవాసి అష్ బహదూర్ దురా విలాసవంతమైన మసెరాటి గ్రెకాలే కారును గెలుచుకున్నారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా ప్రతి నెలా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తూ వస్తున్న ఆయనకు ఈ విజయం ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది.
అదేవిధంగా, ఇటీవల ప్రారంభించిన బిగ్ స్పిన్ డ్రాలో ముగ్గురు టికెట్ హోల్డర్లు నగదు బహుమతులు గెలుచుకోగా, సెప్టెంబర్ 3న జరిగే తదుపరి బిగ్ స్పిన్ డ్రాలో పాల్గొనేందుకు మరో ముగ్గురు టికెట్ హోల్డర్లను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!
- హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..







