ఖతార్లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!
- November 09, 2026
దోహా: ఖతార్లోకి ప్రవేశించేందుకు, దేశం నుంచి బయటకు వెళ్లేందుకు మరో రెండు కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి నిర్ణయం జారీ చేశారు. ఉమ్ అల్ హౌల్ పోర్టు, దుఖాన్ ఎయిర్ బేస్ విమానాశ్రయాలకు ఈ జాబితాలో చోటు కల్పించారు.
కాగా, సముద్ర మార్గంలో ప్రవేశించే, బయటకు వెళ్లే అధికారిక పాయింట్ల జాబితాలో ఉమ్ అల్ హౌల్ పోర్టును చేర్చారు. అలాగే విమాన మార్గంలో రాకపోకలు సాగించే అధికారిక పాయింట్ల జాబితాలో దుఖాన్ ఎయిర్ బేస్ విమానాశ్రయాన్ని చేర్చారు.
అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారిక గెజిట్లో ఈ నిర్ణయం ప్రచురితమైన మరుసటి రోజు నుంచి అమల్లోకి వస్తుంది. నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!
- అల్ దఖిలియాలో OMR103 మిలియన్లతో రోడ్ల ప్రాజెక్టులు..!!
- ఒమన్ సముద్రంలో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- కువైట్లో ‘లులూ వాలీ దీపావళి 2026’ వేడుకలు..!!
- దుబాయ్ నుంచి మనీలాకు Dh1కే విమాన టికెట్..!!
- సౌదీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల్లో సౌదీకరణ మరింత కఠినతరం..!!
- GCC దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం..!!
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు







