జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- August 04, 2026
కువైట్ : జహ్రా గవర్నరేట్‌లో అక్రమ వీధి వ్యాపారులపై కువైట్ మున్సిపాలిటీ తనిఖీలను మరింత ముమ్మరం చేసింది. తాజా ప్రత్యేక తనిఖీల్లో ఏడు మొబైల్ కార్టులను తొలగించడంతో పాటు ఇద్దరిపై ఉల్లంఘన కేసులు నమోదు చేసింది. జహ్రా మున్సిపాలిటీ పరిధిలోని పబ్లిక్ హైజీన్ అండ్ రోడ్ ఆక్యుపెన్సీ విభాగం అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా రోడ్లపై వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం, ప్రజా రహదారులను ఆక్రమణల నుంచి విముక్తం చేయడం ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని అధికారులు తెలిపారు.
జహ్రా గవర్నరేట్ పబ్లిక్ హైజీన్ అండ్ రోడ్ ఆక్యుపెన్సీ విభాగం డైరెక్టర్ నవాఫ్ అల్ ముతైరీ మాట్లాడుతూ.. ప్రాంతంలో అక్రమ వీధి వ్యాపారులు పెరుగుతున్నట్లు గుర్తించిన అనంతరం ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టామని చెప్పారు. గవర్నరేట్ వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రోడ్ల పక్కన అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహించడాన్ని పూర్తిగా అరికడతామని స్పష్టం చేశారు.
జహ్రా గవర్నరేట్‌లోని అన్ని ప్రాంతాల్లో వీధి వ్యాపారులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, ప్రజా పరిశుభ్రతను కాపాడటం, రహదారులు మరియు బహిరంగ ప్రదేశాలను అక్రమ ఆక్రమణల నుంచి రక్షించడం, మున్సిపల్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని మున్సిపాలిటీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







