మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!
- August 04, 2026
మస్కట్: ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక పార్కింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. పరిమిత కాలం పాటు P1, P2 పార్కింగ్ ప్రాంతాల్లో రోజుకు కేవలం OMR 3.200 చెల్లించి వాహనాలను పార్క్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 30 వరకు అందుబాటులో ఉంటుందని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది. దీంతో ప్రయాణికులు తమకు అనుకూలమైన పార్కింగ్ స్థలాన్ని ఎంచుకుని మరింత సౌకర్యవంతంగా ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని పేర్కొంది.
తమ అధికారిక సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ఒమన్ ఎయిర్‌పోర్ట్స్.. ప్రయాణికులు ఈ ప్రత్యేక ఆఫర్‌ను వినియోగించుకుని విమానాశ్రయంలోని ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. టెర్మినల్‌కు సమీపంలోనే నిర్ణీత రోజువారీ చార్జీతో పార్కింగ్ సౌకర్యం లభించడం వల్ల ప్రయాణం మరింత సులభంగా మారనుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







