కువైట్‌లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్‌యూవీల రీకాల్..!!
- August 04, 2026
కువైట్ : భద్రతా లోపాల కారణంగా కువైట్ ప్రభుత్వం పలు ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీ మోడళ్లను రీకాల్ చేసింది. 2022–2027 రేంజ్ రోవర్, 2020–2027 డిఫెండర్, 2021–2027 డిస్కవరీ మోడళ్లను రీకాల్ చేసినట్టు కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆగస్టు 3న ప్రకటించింది. ఈ వాహనాల్లోని ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థలో కనెక్టర్ కాలక్రమేణా తుప్పు పట్టే అవకాశం ఉందని, దీంతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మోడళ్ల యజమానులు తమ వాహనాలను వెంటనే అధికారిక సర్వీస్ కేంద్రాలకు తీసుకువెళ్లి ఉచితంగా తనిఖీ చేయించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
వాహన యజమానులు అలి మహ్మద్ తునయాన్ అల్‌ఘనిమ్ అండ్ సన్స్ ఆటోమోటివ్ కంపెనీ హెల్ప్‌లైన్ 1846464ను సంప్రదించి ముందస్తుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఈ ల్యాండ్ రోవర్ వాహనాలను బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తయారు చేస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఆధీనంలో ఉంది.
ఇటీవలే సౌదీ అరేబియా కూడా 2025 ఆడి Q5 మోడల్‌కు చెందిన 96 వాహనాలను సీటుబెల్ట్ ప్రీటెన్షనర్‌లో లోపం కారణంగా రీకాల్ చేసింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ఇంజిన్ స్టార్టర్‌లో అగ్నిప్రమాద ప్రమాదం ఉన్న నేపథ్యంలో బీఎండబ్ల్యూ ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన రీకాల్ ప్రభావం యూఏఈలోని వాహన యజమానులపై కూడా పడింది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







